కాలం నీతో నడువదు
నిన్నడిగి ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదునీ లక్ష్యం చేరే మార్గంలో
ప్రతి సెకను విలువని తెలుసుకో
ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు
మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు
ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు
దానిలో విలువను ఇస్తే గెలుస్తవు
అది మరిచితే అక్కడే ఆగుతావు
కాలం నీతో నడువదు
నిన్నడిగి ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి
సమయమే కదరా దానికి ఆయుధం
మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే
క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం
సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది
గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో
గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో
అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా
కాలం నీతో నడువదు
నిన్నడిగి ముందుకు సాగదు
సంకల్పం ఒకటే చాలదు దానికి
సమయమే కదరా దానికి ఆయుధం
ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని
తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి
నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా
విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా
క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం
స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం
ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం
No comments:
Post a Comment