Sunday, 5 May 2024

ఎందుకో ఎందుకో - గోపాల గోపాల

 ధుమ్ త నకర నకర నకర

ధుమ్ త నకర నకర నకర పిల్లి మనకి ఎదురు పడితె పనులు ఏవి జరగవంట మనం పిల్లికెదురు పడితె కర్మ కాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పలుకు దోషమంట నక్క తోక లక్కు అంట నక్క అరుపు మృత్యువంట ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకెందుకెందుకో ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకి ముఖ్యమంటు కుడికాలు ముందు అంటు మూఢ నమ్మకాలు ఎందుకో ఓ ... ఎందుకో ఎందుకో జీవ రాసులన్ని దైవమంటు జంతు బలులు ఇంక దేనికో నీలోన ధైర్యముండగా దారాలు ఎందుకో నీ ఆత్మ శక్తి ఉండగా తాయెత్తులెందుకో చేతలే చేయకా చేతికే రంగు రాళ్ళు ఉంగరాలు ఎందుకో పేరుకేమొ మంగళవారం పనులకేమొ అమంగళం శని వున్న శనివారం జరుపుతాము శుభకార్యం బండిలోన వందలాది పరికరాలు ఉన్నగాని ఇంత నిమ్మకాయ పైన అంతులేని విశ్వాసం ఎందుకో ఎందుకో భూమి బంతి లాగ తిరుగుతుంటె దిక్కులన్ని మారుతుంటె వాస్తు నమ్మకాలు ఎందుకో ఎందుకో ఎందుకో నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటె దిష్టి బొమ్మలింక ఎందుకో శూలాల్ని నోటి లోపల గుచ్చేది ఎందుకో పాలల్ని పుట్ట లోపల పోసేది ఎందుకో సూటిగా ఎప్పుడూ నడవకా ఇంక నిప్పు లోన నడక ఎందుకో గో గో గో గో గోపాలా గో గో గో గో గోపాలా

No comments:

Post a Comment