Sunday, 5 May 2024

ఎందుకో ఎందుకో - గోపాల గోపాల

 ధుమ్ త నకర నకర నకర

ధుమ్ త నకర నకర నకర పిల్లి మనకి ఎదురు పడితె పనులు ఏవి జరగవంట మనం పిల్లికెదురు పడితె కర్మ కాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పలుకు దోషమంట నక్క తోక లక్కు అంట నక్క అరుపు మృత్యువంట ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకెందుకెందుకో ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకి ముఖ్యమంటు కుడికాలు ముందు అంటు మూఢ నమ్మకాలు ఎందుకో ఓ ... ఎందుకో ఎందుకో జీవ రాసులన్ని దైవమంటు జంతు బలులు ఇంక దేనికో నీలోన ధైర్యముండగా దారాలు ఎందుకో నీ ఆత్మ శక్తి ఉండగా తాయెత్తులెందుకో చేతలే చేయకా చేతికే రంగు రాళ్ళు ఉంగరాలు ఎందుకో పేరుకేమొ మంగళవారం పనులకేమొ అమంగళం శని వున్న శనివారం జరుపుతాము శుభకార్యం బండిలోన వందలాది పరికరాలు ఉన్నగాని ఇంత నిమ్మకాయ పైన అంతులేని విశ్వాసం ఎందుకో ఎందుకో భూమి బంతి లాగ తిరుగుతుంటె దిక్కులన్ని మారుతుంటె వాస్తు నమ్మకాలు ఎందుకో ఎందుకో ఎందుకో నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటె దిష్టి బొమ్మలింక ఎందుకో శూలాల్ని నోటి లోపల గుచ్చేది ఎందుకో పాలల్ని పుట్ట లోపల పోసేది ఎందుకో సూటిగా ఎప్పుడూ నడవకా ఇంక నిప్పు లోన నడక ఎందుకో గో గో గో గో గోపాలా గో గో గో గో గోపాలా

మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా.... - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా....

పనేం తోచక పరేషాన్ గా గడబిడ పడకు అలా.. మతోయెంతగా.. శృతే పెంచక విచారాల విల విలా... సరే చాలిక.. అలా జాలిగా తికమక పడితె ఎలా.. కన్నీరై కురవాలా.. మన చుట్టూ ఉండే లోకం తడిసేలా... ముస్తాబే చెదరాలా..నిను చూడాలంటే అద్దం జడిసేలా... ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల.. అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల.. మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా.... సరే చాలిక... అలా జాలిగా తికమక పడితె ఎలా.. ఎండలను దండిస్తామా.. వానలను నిందిస్తామా.. చలినెటో తరిమేస్తామా.. చీ పొమ్మనీ... కస్సుమని కలహిస్తామా.. ఉస్సురని విలపిస్తామా..రోజులతొ రాజీ పడమా.. సర్లెమ్మనీ... సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం... పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం.. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల.. అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల. చమటలేం చిందించాలా.. శ్రమపడేం పండించాలా.. పెదవిపై చిగురించేలా.. చిరునవ్వులు.. కండలను కరిగించాలా.. కొండలను కదిలించాలా.. చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు... మనుషులనిపించే ఋజువు.. మమతలను పెంచే ఋతువు.. మనసులను తెరిచే హితవు.. వందేళ్ళయినా వాడని చిరునవ్వు.. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల.. అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల.

మెరుపై సాగరా - Style

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా

నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతు ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్ నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి అందరికి చేతుల్లో ఉంటుంది గీతా నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత లేరా చిందెయ్ రా విజయం నీదేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

చల్ చలో చలో - S/o Satyamurthi

రాజ్యం గెలిసినోడు రాజవుతాడు

రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు

యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు యుద్ధం ఇడిసెయ్తోడేయ్ దేవుడు చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవు గనక కష్టలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించావ్ గనక ఎదురే లేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డ వాడే కష్ట పడ్డ వాడే పైకి లేచే ఉగ్ర హోరు ఒక్కడైనా కాన రాడ్డే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో మడతే నలగని షర్ట్ లాగా అల్మరాహ్ లో పడి ఉంటె అర్ధం లేదు యీటె తగలని కాగితంల ఒట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కోతేమ్ కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపొర నీదైన గెలుపు దారిలోన చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం - Sambaram

 పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం

కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే కష్టం అంటే దూది కూడా భారమే లక్ష్యమంటూ లేని జన్మే దండగా లక్షలాది మంది లేదా మందగా పంతం పట్టీ పోరాడందే కోరిన వరాలు పొందలేరు కదా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా చేస్తూ ఉంటే ఏ పనైనా సాద్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేదీ లేదురా నవ్వే వాళ్ళు నిద్దరపోగా దిక్కులు జెయించి సాగిపోరమరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

కాలం నీతో నడువదు - SWAERO


కాలం నీతో నడువదు

నిన్నడిగి ముందుకు సాగదు

సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు
నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడుగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదను అడుగదు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు దయ దాక్షిణ్యాలే ఉండవు దానిలో విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువని మార్చడం సమయాభావం తప్పని అది లేదని చెప్తే కుదరది గెలిచినా వీరుడి మనసును అడుగు సమయం విలువేంటో గడచిన నీ గత కాలాన్ని అడుగు నువ్వు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిస రా కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా దానికి ఆయుధం ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి ఒకేసారి నువ్వు బ్రతిమాలి చూడు నువ్వు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తాదేమో నీ వైపు చూసి సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా విలువలతోనే బ్రతుకే బ్రతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తాదిరా సమయం అనునిత్యం స్వేరోసైనికుడై సాగర కలం నీ నేస్తం ఆ జెండా ఎత్తి నడవరా తమ్ముడా ధైర్యం అనునిత్యం

ఇదే కదా ఇదే కదా నీ కథ - మహర్షి

 ఇదే కదా ఇదే కదా నీ కథ

ముగింపు లేనిదై సదా సాగదా


ఇదే కదా ఇదే కదా నీ కధ

ముగింపు లేనిదై సదా సాగదా

నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా

ఓ నీటి బిందువే కదా నువ్వేతుకుతున్న సంపద

ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందిగా

ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా..

మనుష్యులందు నీ కధా...మహర్షి లాగ సాగదా

మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా


ఇదే కదా ఇదే కదా నీ కధ

ముగింపు లేనిదై సదా సాగదా


ఇదే కదా ఇదే కదా నీ కధ

ముగింపు లేనిదై సదా సాగదా

నిస్వార్ధమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా

సిరాను లక్ష్యమెంపదా చిరాక్షరాలు రాయదా

నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా

నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా..

మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా...

మనుష్యులందు నీ కధా.. మహర్షి లాగ సాగదా...